అధిక వడ్డీ వేధింపుల తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య..!!.

కరీంనగర్ జిల్లా అన్నారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధతో వడ్డీలు కట్టలేక, ప్రశాంత్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని డబ్బులు కట్టలేక పోయానని యువకుడు సూసైడ్ నోట్ లో రాశాడు. ప్రశాంత్ భార్య గర్భవతి కావడంతో గ్రామంలో రోదనలు మిన్నంటాయి. మృతికి కారణమైన వడ్డీ వ్యాపారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేవలం అధిక వడ్డీ వేధింపుల కారణంగానే నూరేళ్లు బ్రతకాల్సిన ఓ యువకుడు ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడంపై కుటుంబ సభ్యులు, భార్య, తల్లిదండ్రులు తీవ్రమనోవేదనకు గురవుతున్నారు. సూసైడ్‌ లెటర్‌ చదువుతూ కన్నీటిపర్యంతమవుతున్నారు..