కేతేపల్లి గ్రామంలో విషాదం… రధోత్సవం కార్యక్రమంలో రధానికి విద్యుత్ తీగ తగిలి కరెంట్ షాక్ తో ముగ్గురు వ్యక్తులు మృతి….

నల్గొండ జిల్లా.

.నాంపల్లి మండలం కేతేపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది..గ్రామంలో ని
శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయం వద్ద ఉన్న రథాన్ని పక్కకు జరుపుతున్న క్రమంలో రథానికి అనుకోని ఉన్న కరంట్ వైర్ తగిలి విద్యుత్ షాక్ తగిలింది..దింతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు..మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.. మొన్నటి శ్రీరామనవమి వేడుకల్లో ఇనుముతో తయారు చేసిన 30 అడుగుల రథo తో గ్రామంలో రధోత్సవం నిర్వహించారు.. ఇవ్వాళ గ్రామ పెద్దలు, అయ్యగారు గుడిని శుభ్రం చేయిస్తూ, రథాన్ని కూడా గుడి లోపలోకి జరపాలని ప్రయత్నించారు ..ఇంతలోనే ఈ ఘోరం జరిగింది….మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.. డెడ్ బాడీ లకు పోస్ట్ మార్టం నిర్వహించేందుకి డాక్టర్ లు ఏర్పాట్లు చేస్తున్నారు…..