ఓ మహిళ చేయకూడని పనిని నిందితురాలు…పిన్నీ అని పిలిచే ఆ యువతిని పథకం ప్రకారం ఇంటికి పిలిపించి ఆమెపై లైంగిక దాడి యత్నం….

భర్తతో సంబంధం ఉందని అనుమానించింది. కోపంతో రగిలిపోతూ విచక్షణ కోల్పోయింది. తోటి యువతి అనే ఆలోచన ఏమాత్రం లేకుండా పాశవికంగా వ్యవహరించింది. పిన్నీ అని పిలిచే ఆ యువతిని పథకం ప్రకారం ఇంటికి పిలిపించి ఆమెపై లైంగిక దాడి చేయించేందుకు ప్రయత్నించింది. దాన్ని వీడియో కూడా చిత్రీకరించింది…దాదాపు 45 నిమిషాల పాటు ఈ ఘోరం చోటు చేసుకుంది. సంచలనం సృష్టించిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు.. ప్రధాన నిందితురాలు సహా ఆరుగురిపై ‘అత్యాచారం’ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం ఈ అమానుష ఘటన హైదరాబాద్ పరిధిలోని కొండాపూర్ లో చోటుచేసుకుంది….

ఓ మహిళ చేయకూడని పనిని నిందితురాలు గాయత్రి చేసింది….

భర్తపై అనుమానం తో ఓ యువతి జీవితాన్ని ఆగం చేయాలనుకుంది గాయత్రి… అనుమానిస్తూ ఎలాగైనా ఆ యువతి ఇబ్బందికి గురి చేయాలని ఆలోచన తో యువతని భయబ్రాంతులకు గురి చేయాలని దారుణంగా హింసించి గాయత్రి పథకం వేసింది….
బాధిత యువతికి ఫోన్‌ చేసి కొండాపూర్‌కు వస్తే మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకుందామంది. దీంతో ఆమె తన తల్లిదండ్రులు, ఇద్దరు న్యాయవాదులతో మధ్యాహ్నం 3 గంటలకు గాయత్రి ఇంటి వద్దకు వెళ్లింది….గాయత్రి ఇండిపెండెంట్‌ హౌస్‌కు సమీపంలో ఉన్న ఓ హోటల్‌ వద్దకు వెళ్లిన వీళ్లు ఆ విషయం ఆమెకు ఫోన్‌ చేసి చెప్పారు. దీంతో బయటకు వచ్చిన గాయత్రి మిగిలిన వారిని హోటల్‌ వద్దనే ఉంచి యువతిని తనతో తీసుకువెళ్లింది…తన వద్ద డ్రైవర్ గా పని చేసి ప్రస్తుతం పాన్ షాప్ నడుపుతున్న మస్తాన్‌(25), ముజాహిద్‌లతో (25) పాటు వీరి స్నేహితులైన అయ్యప్ప సొసైటీకి చెందిన విష్ణు (22) మనోజ్‌ (22), కడపకు చెందిన మౌలాలిలతో కలిసి ప్లాన్ వేసింది…. అప్పటికే ఇంట్లొ ఉంచింది. బాధితురాలు ఇంట్లోకి రాగానే..ఐదుగురు యువకులతో కలిసి యువతి నోట్లో గుడ్డలు కుక్కింది. వివస్త్రను చేసింది. సామూహిక లైంగిక దాడి చేయించేందుకు ప్రయత్నించింది. లక్షణ రహితంగా చెప్పుకోలేని చోట తీవ్రంగా కొడుతూ.. హింసించారు…. రక్తస్రావం కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో ఈ లోపు ఫోన్ ఎత్తకపోవడం, ఎంతసేపైన రాకపోవడంతో ఏం జరిగిందని అనుమానంతో లాయర్లు తల్లిదండ్రులు గాయత్రి ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేశారు… అప్పటికే అక్కడ ఘటన మొత్తాన్ని గాయత్రి తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేసింది. బయటే వేచి చూస్తున్న యువతి తల్లిదండ్రులు, న్యాయవాదులు ఆమె రాకపోవడంతో ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ప్రధాన గేటు ముందు, నాలుగు పెంపుడు కుక్కలను గేటు వద్ద కట్టేసింది…శునకాలను తప్పించుకుని లోనికి వెళ్లడానికి దాదాపు 20 నిమిషాలు పట్టింది… వీరు వచ్చింది చూసి అప్పటికి గాయత్రి సహా ఆరుగురూ ఇంటి వెనుక ఉన్న నిచ్చెన సాయంతో గోడ దూకి పారిపోయారు…..ప్రధాన నిందితురాలతో సహా ఆరుగురిపై ‘అత్యాచారం’ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు., పోలీసులు…