సూర్యాపేటలో నకిలీ ఇంజన్ ఆయిల్ తయారీ దారుల అరెస్ట్…!!

13.8 లక్షల నకిలీ ఇంజన్ ఆయిల్ సీజ్ చేసిన సూర్యాపేట జిల్లా CCS మరియు సూర్యాపేట రూరల్ పోలీస్…

సూర్యాపేట రూరల్ పోలీసు స్టేషన్ నందు కేసు నమోదు..

పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ. రాజేంద్ర ప్రసాద్ IPS..

ఆయిల్ కంపెనీలో పని చేసిన అనుభవంతో సొంతంగా వ్యాపారం మొదలు పెట్టిన నిందితుడు..
ఇలాంటి వ్యాపారాలు నిర్వహిస్తే చట్టపరంగా కటిన చర్యలు తప్పవు అని హెచ్చరించిన జిల్లా ఎస్పీ .

కేసు వివరాలు.
ఎస్పీ గారు మాట్లాడుతూ..
సూర్యపేట మండలము, రాయినిగూడెం గ్రామానికి, చెందిన రేపాల మోహన్ రెడ్డి వయస్సు. 35 సం.లు, వృత్తి. వ్యాపారం, జనగాం ఎక్స్ రోడ్ నుండి పిల్లలమర్రి గ్రామము వెళ్ళే దారిలో గల గుండేటి పుష్పలత ఇంటిని నవంబర్ 2020 సం. నుండి కిరాయికి తీసుకొని Shastra enterprises అనే పేరుతో ఇంజిన్ ఆయిల్ షాప్ పెట్టి, మొదట కొన్ని నెలలు SAVSOL కంపెనీ ఆయిల్ ను తీసుకొచ్చి చుట్టుపక్కల వున్న మెకానిక్ లకు మరియు కస్టమర్ లకు అమ్ముతూ తనకు వ్యాపారం లో తక్కవ ఆదాయం వస్తుందని, ఎక్కువ ఆదాయం రావలనే ఆశతో నకిలీ ఇంజిన్ ఆయిల్ ను హైదరాబాద్ నుండి కొనుకొచ్చి, లీటరు 140/- కొనుకొచ్చి దానిని 900ml, 5 లీటర్, 20 లీటర్, 25 లీటర్, ప్లాస్టిక్ tins లలో నింపి వాటికి Champion Active 20W-40T ఆయిల్, Hero Genuine 4T plus ఆయిల్,Champion New generation Lubricants , JD ఆయిల్, EEXCEL Active Plus 20W-40T అను కంపెనీ పేర్లు గల స్టిక్కెర్స్ అతికించి వాటిలో నకిలీ ఇంజిన్ ఆయిల్ ను నింపి ప్యాక్ చేసి సూర్యపేట చుట్టూ ప్రక్కల వున్న మెకానిక్ లకు మరియు customers లకు ఒక్క లీటర్ కు 250/-, రూపాయల చొప్పున ఒరిజినల్ ఇంజిన్ ఆయిల్ కంపెనీ ఆయిల్ గా అమ్ముతూవుండగా, నమ్మదగిన సమాచారం పై ఈ రోజు అనగా తెధి 10.06.2022 ఉదయం 10.00 గంటలకు అట్టి షాప్ లో నకిలీ ఇంజిన్ ఆయిల్ ను ప్లాస్టిక్ Tin లో నింపుతుండగా సూర్యపేట్ జిల్లా సి‌సి‌ఎస్ పోలీసు మరియు రూరల్ పోలీసులు సంయుక్తంగా CCS CI రవి, రూరల్ SI సాయి రామ్, SIs మహేశ్, మహేందర్ మరియు సిబ్బంది వెళ్ళి పట్టుబడి చేసి ఈ క్రింది వాటిని స్వాదినం చేసినారు.
*స్వాదినం చేసుకున్న సరుకు వివరాలు*
1. Champion Active 20W-40T ఆయిల్ బాక్స్ లు 20 కలవు (ఒక్క బాక్స్ లో 20 టిన్నులు ఉన్నవి, ఒక్క టిన్ను 900 ml ఉంటుంది) (20x 20=400 tins)
2. Hero Genuine 4T plus ఆయిల్ బాక్స్ లు 45 కలవు (ఒక్క బాక్స్ లో 20 టిన్ను లు ఉన్నవి, ఒక్క టిన్ను 900 Ml ఉంటుంది),(45×20=900 tins)
3. Champion New generation Lubricants (5) బాక్స్ లు కలవు, (అట్టి బాక్స్ లో 4 టిన్నులు ఉన్నవి, ఒక్క టిన్ను 5 లీటరు ఉంటుంది), (5×4=20 tins)
4. JD ఆయిల్ బాక్స్ లు (4) కలవు, (అట్టి బాక్స్ లో 4 టిన్నులు ఉన్నవి, ఒక్క టిన్ను 5 లీటరు ఉంటుంది), (4×4=16 tins)
5. Champion 20 Litres ఆయిల్ buckets 3 కలవు,( 3 buckets)
6. EEXCEL Active Plus 20W-40T ఆయిల్ బాక్స్ లు (2) కలవు (ఒక్క బాక్స్ లో 20 టిన్నులు ఉన్నవి, ఒక్క టిన్ను 900 ml ఉంటుంది), (20×2=40 tins)
7. Plane 25 Litres ఆయిల్ buckets (8) కలవు,
8. 200 లీటర్ కలిగిన (2) డ్రమ్స్ .
9. Hand Pumps-4
10. వివిధ కంపెనీ పేర్లు గల లేబుస్ మరియు స్టీక్కెర్స్
11. 5 liters మరియు 10 liters కొలత గల జగ్గులు -2
12. స్టీక్కెర్స్ ను అతికించటానికి ఉపయోగించిన ఇస్త్రీ పెట్టెలు-2
స్వాధీనం చేసుకున్న మొత్తం ఆయిల్ విలువ సుమారు Rs 13,80,000/-
ఇట్టి నేరస్తుడు రేపాల మోహన్ రెడ్డి, వయస్సు. 35 సం.లు, వృత్తి. వ్యాపారం, రాయినిగూడెం గ్రామం కేసు నమోదు చేసి పరిశోధన చేయుచున్నాము.
ఇట్టి నకిలీ ఆయిల్ వ్యాపారాన్ని బట్ట బయలు చేసి నేరస్తున్ని పట్టుకొన్న , CCS CI రవ, సూర్యపేట్ రూరల్ యస్.ఐ సాయి రామ్, SIs మహేశ్, మహేందర్ మరియు సిబ్బందినీ ఎస్పీ గారు అభినందించారు.

ఎస్పీ వెంట DSP నాగభూషణం, CI లు విఠల్ రెడ్డి, రవి, SI లు సాయిరాం, మహేష్, సిబ్బంది ఉన్నారు.