గంజాయి మత్తు.. పోలీసు వాహనం పైకెక్కి నానా బీభత్సం…

హైదరాబాద్‌ ఆసిఫ్‌నగర్‌లో అర్ధరాత్రి యువకులు హల్‌చల్‌ చేశారు. రాయల్సీ హోటల్‌ వద్ద గంజాయి మత్తులో వీరంగం సృష్టించారు.నడిరోడ్డుపై వాహనదారులకు తీవ్ర ఆటంకం కలిగించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలోనూ యువకులు నానా బీభత్సం సృష్టించారు. పోలీసు వాహనం పైకి ఎక్కి రచ్చరచ్చ చేశారు. ఈ క్రమంలో పోలీసుల కారుతో పాటు మరికొన్ని వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు.