అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు…

వెంచర్లలో చోరీలకు పాల్పడుతున్న తొమ్మిది మందితో కూడిన అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌, ఆగ్రాకు చెందిన వీరంతా ఎలక్ట్రీషియన్లుగా చెప్పుకొని బిల్డర్ల వద్ద పనిలో చేరుతున్నారు. పగలంతా వెంచర్లలో పనులు చేస్తూ రాత్రిపూట అక్కడి నిర్మాణ సామగ్రి, వైర్లు, ఎలక్ట్రిక్‌ వస్తువులు చోరీ చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఈ ముఠా చోరీలకు పాల్పడుతోంది. ఇటీవల ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టినట్టు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ మీడియాకు వెల్లడించారు. నిందితుల నుంచి రూ.55లక్షల విలువైన మెటీరియల్‌, రూ.9.50లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు……వీరితో పాటు మనీష్‌ అనే ఓ ఎలక్ట్రికల్‌ షాపు యజమానితో పాటు ఓ స్క్రాప్‌ ఏజెన్సీకి చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అరెస్టయిన నిందితులంతా రాజస్థాన్‌కు చెందిన వారేనని, వీరంతా దిల్లీలో పనిచేసినప్పుడు పరిచయమయ్యారని సీపీ పేర్కొన్నారు. ఈకేసులో రాజస్థాన్‌కు చెందిన ప్రదీప్‌ కుష్వాల్‌ ప్రధాన నిందితుడిగా గుర్తించినట్టు సీపీ వివరించారు. దొంగతనాలకు పాల్పడే సమయంలో తుపాకితో బెదిరించే వారని, నిందితులపై పీడీ యాక్టు పెడతామని సజ్జనార్‌ వివరించారు..