శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
అక్రమ తీసుకువచ్చిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం చోటుచేసుకుంది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు పేస్టు రూపంలో ఉన్న బంగారాన్ని నడుము భాగంలో ప్రత్యేకంగా కుట్టిన జేబులో దాచి ఉంచి తీసుకువచ్చాడు. తనిఖీల్లో భాగంగా అధికారులు బంగారాన్ని గుర్తించారు. 395.07 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.19.98 లక్షలుగా సమాచారం.