సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం లో ట్రాక్టర్ బోల్తా..ఒకరు మృతి..17 మందికి తీవ్ర గాయాలు..

*కూలీల ట్రాక్టర్ బోల్తా*
సూర్యాపేట జిల్లా చిలుకూరు లో ఘోర రోడ్డు ప్రమాదం
*17 మందికి తీవ్ర గాయాలు*
*ఒకరు మృతి*

హుజూర్ నగర్ పట్టణంలోని సీతారాంనగర్ కు చెందిన వరినాట్ల కూలీలు 18 మంది నాట్లు వేసేందుకు చిలుకూరు మండలంలోని సీతారాంపురం సమీపంలో ఉన్న పొలంలో నాటు వేసేందుకు వెళ్లి నాట్లు వేసి వస్తూ తిరుగు ప్రయాణం లో ట్రాక్టర్ బోల్తా పడడం తో 17 మందికి గాయాలయ్యాయి అందులో ప్రమిల మహిళా మృతి చెందారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్తితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలింపు…

మరికొంత మంది క్షతగాత్రులను హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు.. కూలీల అందరూ
సీతారాం నగర్ కు చెందిన వారే కావడం తో హుజూర్ నగర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి హుజూర్ నగర్.యస్.ఐ వెంకటరెడ్డి,సుందరయ్య లు చిలుకూరు ఏ.యస్.ఐ పులి వెంకటేశ్వర్లు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.