ఎస్ఐ విజయ్ కుమార్ ఆత్మహత్య కేసులో ఓ ట్విస్ట్…..

ఎస్ఐ విజయ్ కుమార్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్….

కృష్ణా జిల్లాలో ఎస్ఐ విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఎస్ఐ విజయ్ కుమార్ ఆత్మహత్య కేసులో ఓ ట్విస్ట్ బయటకు వచ్చింది. విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో అతని ప్రియురాలు సురేష్ అదే ప్లాట్ లో ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. నాలుగు నెలల క్రితం వేరే అమ్మాయిని ఎస్ఐ విజయ్ కుమార్ వివాహం చేసుకున్నాడు. దీంతో ప్రియురాలు సురేఖకు, ఎస్ విజయ్ కుమార్ కు మధ్య వివాదం చెలరేగింది. నిన్న రాత్రి ప్రియురాలు సురేఖ ఎస్ ఐ విజయ్ కుమార్ ప్లాట్ కు వచ్చి సూసైడ్ చేసుకుంటా అని బెదిరించింది. బాత్ రూమ్ లోకి వెళ్లి గడియపెట్టుకుంది. దీంతో విజయ్ కుమార్ కంగారు పడ్డాడు. ఆత్మహత్య చేసుకుంటుందేమో అనే భయంతో, ఎస్ ఐ విజయ్ కుమార్ ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బాత్ రూమ్ లో నుంచి బయటకు వచ్చిన సురేష్ ఆ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యింది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు బ్యూటీషియన్ సురేఖను ప్రశ్నించారు. రేపు సురేఖను అరెస్ట్ చేయబోతున్నారు.