ప్రేమించలేదనే కారణంతో యువతిపై కత్తితో దాడి..

జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించలేదనే కారణంతో యువతిపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. వివరాలు.. ప్రొద్దుటూరుకు చెందిన సునీల్‌ , లావణ్య అనే యువతిని మూడు నెలలుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎవరూ లేని సమయంలో లావణ్య ఇంటికి వెళ్లిన సునీల్‌ తనను ప్రేమించాల్సిందిగా బెదిరించాడు. ఆమె అంగీకరించకపోవడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో లావణ్యపై దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన లావణ్యను ఆస్పత్రికి తరలించారు.