హైకోర్టు న్యాయవాది దంపతుల హత్య…

హైకోర్టు న్యాయవాది దంపతుల హత్య…

పెద్దపల్లి, రామగిరి మండలం కలవచర్ల గ్రామంలో దారుణం జరిగింది. కారులో హైదరాబాద్‌కు వెళ్తున్న హైకోర్టు న్యాయవాది గట్టు వామన్‌రావు, నాగమణి దంపతులు హత్యకు గురయ్యారు. కారు ఆపి దంపతులిద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు చంపేసి పరారయ్యారు. కారులోనే విచక్షణారహితంగా కత్తులతో నరికిచంపిన దుండగులు. హత్యకు గురైన లాయర్‌ది మంథని మండలం గుంజపడుగు స్వగ్రామం. తమ గ్రామానికి వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ఈ ఘోరం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.