మద్యం కోసం డబ్బులు ఇవ్వటం లేదని భార్యను హతమార్చిన భర్త..

మద్యం కోసం డబ్బులు ఇవ్వటం లేదని భార్యను హతమార్చిన భర్త…

మద్యం కోసం డబ్బులు ఇవ్వటం లేదని భార్యను హతమార్చిన భర్త…
శంషాబాద్ లో దారుణం జరిగింది. మద్యం కోసం డబ్బులు ఇవ్వటం లేదని భార్యను చితకబాదాడు ఓ భర్త. అయితే ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో బంధువులు గాంధీ హస్పటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంద్రారెడ్డి కాలనీలో ఈ దారుణం జరిగింది. సురేష్ అనే వ్యక్తి తాగుడుకుబానిసై భార్య స్వప్నతో రోజు గొడవ పడేవాడు. అయితే నిన్న భర్త సురేష్ భార్యను కొట్టడంతో తీవ్రగాయాలు అయ్యాయి. దాంతో స్వప్నను గాంధీ హస్పటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మరణించింది స్వప్న. ఇక భర్త సురేష్ పై పొలీసులకు ఫిర్యాదు చేసారు మృతురాలి బంధువులు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తున్నారు పోలీసులు.