కోదాడలో విషాదం..పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య…

సూర్యాపేట జిల్లా :………..
కోదాడలో విషాదం…. కోదాడ పెద్ద చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమజంట.

కోదాడ పట్టణంలోని పెద్ద చెరువులో దూకి ప్రేమికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. లక్ష్మీపురానికి చెందిన మణికంఠ (19) తాపీమేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఫాతిమ (17) కోదాడ పట్టణంలో అరబిక్‌ ఖురాన్‌ నేర్చుకుంటున్నది. వీరిద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వాళ్లిద్దరు నిన్న రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవాళ కోదాడ పెద్దచెరువులో మృతదేహాలను గుర్తించిన జాలర్లు.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీయించారు. మృతులను మణికంఠ, ఫాతిమగా గుర్తించారు. ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించరనే అనుమానంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.