రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి…

*రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి..

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ జాతీయ రహదారి బైపాస్ అన్నారం వై జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మృతుల వివరాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు.
అన్నారం వై జంక్షన్ వద్ద షిఫ్ట్ కారు అతి వేగంతో డివైడర్ ను ఢీకొంటు ఎదురుగా అటువైపు వస్తున్న లారీని ఢీకొన్న సంఘటనలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది ఘటనలో ఓ బాలుడితో పాటు మరో ఇద్దరు మృతి చెందారు . సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో హైదరాబాద్ నుండి జడ్చర్ల వైపు చేపలు పట్టేందుకు సరదాగా వెళుతూ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.