ఇద్దరు నకిలీ విలేకరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..

ఇద్దరు నకిలీ విలేకరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్‌లో ఇద్దరు నకిలీ విలేకరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఏలూరు శివారులో చింతలపూడి నుంచి బియ్యం లోడుతో కేరళ వెళ్తున్న లారీని ఇద్దరు యువకులు కారుతో అడ్డగించారు.

విలేకరులమంటూ తమకు డబ్బు ఇవ్వాలని లేకుంటే పోలీసులకు పట్టిస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు.

లారీ డ్రైవర్ డబ్బులు ఇస్తుండగా అతని పర్సు లాక్కుని యువకులు పరారయ్యారు.

ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌‌లో లారీ డ్రైవర్ ఫిర్యాదు చేశాడు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.