అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు దారుణమైన ఘటన..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు దారుణమైన ఘటన వెలుగు చూసింది… మెదక్ జిల్లాలో ఓ వివాహితపై యాసిడ్ పోసి పరారయ్యారు గుర్తుతెలియని వ్యక్తులు… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అల్లాదుర్గం మండలం మల్కాపూర్ తాండాకు చెందిన 40 ఏళ్ల వివాహితపై.. అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ దగ్గర ఇవాళ తెల్లవారుజామున యాసిడ్ దాడి చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుండగా… చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు స్థానికులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నరు అల్లాదుర్గం పోలీసులు.. పూర్తి వివరాలు తెలుసుకునే పనిలోపడిపోయారు.. అయితే, వివాహేతర సంబంధమే ఈ దాడికి కారణంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు..