చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న లవర్స్..ఖంగుతిన్న పోలీసులు…!

*చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న లవర్స్*

*ఖంగుతిన్న పోలీసులు..*

*నాలుగు ప్రత్యేక బృందాలతో కేసు దర్యాప్తు*

నల్గొండ జిల్లా దేవరకొండ మండలం మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన.

బైక్ పై వచ్చి ఓ మహిళ మెడలోంచి చైన్ స్నాచింగ్ చేసిన లవర్స్.

స్థానికులు వెంబడించినా , హై స్పీడ్ తో పరారైన లవర్స్.

సీసీ ఫుటేజీ లో ఈ లవర్స్ స్నాచింగ్ చూసి ఖంగుతిన్న పోలీసులు.

నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్న దేవరకొండ డీసీపీ..

ఒక యువ జంట చైన్ స్నాచింగ్‌లకు పాల్పడు తుంది. స్కూటీపై వచ్చిన ఈ జంట ఒంటరిగా వెళుతున్న మహిళల మెడల్లో నుంచి చైన్ ను లాగేసుకుటున్నారు.

యవకుడు స్కూటీ నడు పుతుండగా, యువతి మాత్రం మహిళ మెడల్లో నుంచి చైన్‌లను తెంపుకుని పారిపోతున్నారు. ఈ జంట కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

ఈ ఇద్దరు లవర్స్ గా పోలీసులు గుర్తించారు. ఇక విషయానికి వస్తే నల్లగొండ జిల్లాలో ఈ యువజంట చైన్ స్నాచింగ్ కు పాల్ప డుతున్నట్లు తెలిసింది.

మర్రిగూడ మండల యారగండ్ల పల్లి గ్రామానికి చెందిన సాతూ సునీత మెడలో నాలుగు తులాల చైన్ లాక్కొని పారిపోయరు. అయితే స్థానికులు వెంబడించారు

కానీ, హై స్పీడ్ తో పారి పోయరు. సీసీ ఫుటేజ్ ద్వారా ఈ జంటను గుర్తించారు పోలీసులు. దేవరకొండ డిఎస్పి మీడియాతో మాట్లాడుతు ఈ యువ జంట కోసం నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నమని తెలిపారు..