ఆస్పత్రిలోని ఐసీయూ వార్డులో జరిగిన ప్రమాదంలో 10 మంది దుర్మరణం..

మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అహ్మద్ నగర్ జిల్లా ఆస్పత్రిలోని ఐసీయూ వార్డులో జరిగిన ప్రమాదంలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఉదయం 11.30 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయకచర్యలు చేపట్టారు…ఈ దుర్ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవిస్ స్పందించారు. ఈ వార్త విని షాక్‌కు గురయ్యానన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఫడ్నవీస్ ఆశాభావం వ్యక్తంచేశారు. ఆస్పత్రిలో అగ్నిప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై లోతైన విచారణకు ఆదేశించామన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు