14 మసాలా పాపకు కరెంట్ షాక్ పెట్టి చంపిన తండ్రి…

జిల్లా సిద్దిపేట….

R9TELUGUNEWS.COM.
తండ్రి కర్కోటకుడుగా మారి తన వ్యవసాయ పొలం వద్ద 14 మసాలా పాపకు కరెంట్ షాక్ పెట్టి చంపిన ఘటన సిద్దిపేట జిల్లాలో కలకలం రేపుతోంది.. సిద్దిపేట జిల్లా తోగుట మండలం వెంకట్రావు పేట గ్రామానికి చెందిన మిరుదొడ్డి రాజశేఖర్ (45). సునీత (33) లు భార్య.భర్తలు ఉన్నట్టుండి వీరి దాంపత్యంలో కలహాలు మొదలవడంతో అభం శుభం తెలియని 14 మసాలా ప్రిస్సి పాపం తండ్రి రాజశేఖర్ తన వ్యవసాయ పొలం వద్దకు తీసుకెళ్లి మధ్యాహ్న సమయంలో కరెంట్ షాక్ పెట్టి చంపి తాను మిరప చేనుకు వేసే పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయగా కొంతమంది చూసి అతని గజ్వేల్ అర్ వి యం ఆస్పత్రికి తరలించారు అతను సైతం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న టు సమాచారం మొత్తానికి భార్య భర్తల మధ్య గొడవ ఓ పసికందును బలి తీసుకుందని చెప్పాలి ఇంటి వద్ద ఉన్న భార్య సునీత విషయం తెలుసుకున్న హుటాహుటిన చేరుకునే సరికి అప్పటికే ఆ చిన్నారి మృతి చెంది కనిపించడంతో బోరున విలపిస్తూ కుప్పకూలిపోయింది ఈ విషయాన్ని చూసిన గ్రామస్తులంతా కంటతడి పెట్టారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
చిన్నారి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు