భర్త కుట్టిన బ్లౌజ్‌ నచ్చలేదట….చిన్న గొడవతో ప్రాణం తీసుకున్న ఓ ఇల్లాలు…!

*భర్త కుట్టిన బ్లౌజ్‌ నచ్చలేదట….*

*చిన్న గొడవతో ప్రాణం తీసుకున్న ఓ ఇల్లాలు…!
భర్త కుట్టిన బ్లౌజ్‌ నచ్చలేదని భార్య ఆత్మహత్యకు పాల్పడింది ఓ ఇల్లాలు.హైదరాబాద్ లోని అంబర్‌పేట్‌లో జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పూర్తి వివరాల్లోకి వెళితే……

శ్రీనివాసులు, విజయలక్ష్మి దంపతులు గోల్నాక తిరుమలనగర్‌లో నివాసం ఉంటున్నారు. అయితే శ్రీనివాస్‌ ఇంట్లోనే టైలర్‌ పని చేయడంతో పాటు ఆయన ద్విచక్ర వాహనంపై తిరుగుతూ చీరలు విక్రయిస్తుంటాడు. ఇందులో భాగంగానే భార్య కోసం ఇటీవలే ఓ జాకెట్‌ను కుట్టాడు భర్త.అయితే ఆది నచ్చలేదని భార్య చెప్పడంతో శ్రీనివాస్‌కు, విజయలక్ష్మీకి మధ్య వాగ్వాదం చోటు చేసుంది. దీంతో మనస్థాపానికి గురైన భార్య విజయలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ చిన్న గొడవకే ఇల్లాలు ప్రాణం తీసుకోవడం పట్ల నానా రకాల అర్థాలతో…. పలువురు కామెంట్స్ పెడుతున్నారు.ఎంతో పవిత్రమైన మానవ జీవితాన్ని ఇలా ముగిస్తారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు…. ఏంటో.. ఏమో..కొందరి జీవితం….పాపం…