బియ్యం బస్తాల్లో అపహరించిన విగ్రహాలు…

బియ్యం బస్తాల్లో అపహరించిన విగ్రహాలు.

R9TELUGUNEWS.com… ఏళ్ల చరిత్ర ఉన్న రెంజల్‌ మండలం కందకుర్తి రామాలయ విగ్రహాలు లభ్యమయ్యాయి.
ఈ నెల 7న ఆలయంలో పంచలోహ విగ్రహలు చోరీకి గురయ్యాయి. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది.

పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకొని 20 రోజులుగా మహారాష్ట్ర, కర్ణాటకలో పాత నేరస్థులపై నిఘా పెట్టి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు. వచ్చే నెల 1న పుష్యమాస అమావాస్య రోజున గోదావరి ఒడ్డున అన్నదాన కార్యక్రమం చేపట్టనున్న నేపథ్యంలో గుర్తుతెలియని వ్యక్తులు ఈ నెల 25న మహారాష్ట్ర వైపు నుంచి ఆటోలో బియ్యం బస్తాలు, ఇతర సామగ్రి తీసుకొచ్చి ఇక్కడి నిర్వాహకులకు అందించి వెళ్లిపోయారు.
ఆదివారం బస్తాలను తెరిచి చూడగా అందులో పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. గ్రామానికి చేరుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై సీఐ రవీంద్ర నాయక్‌ను వివరణ కోరగా సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుల ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. త్వరలో వారిని పట్టుకుంటామని పేర్కొన్నారు.