చేపల వేటలో విషాధం. కొమ్ము కోనాం చేప దాడి.. మత్స్యకారుడు మృతి..

*విశాఖపట్నం జిల్లా*
R9TELUGUNEWS.COM.
*చేపల వేటలో విషాధం. కొమ్ము కోనాం చేప దాడి..

*కొమ్ముతో గుద్దడంతో వ్యక్తి మృతి*

ముత్యాలమ్మపాలెంకు చెందిన 5గురు మత్స్యకారులు నిన్న సాయంత్రం సంప్రదాయ పడవలపై వేటకు వెళ్లారు.

తీరం నుంచి సుమారు 8 కిలోమీటర్ల వరకు వెళ్లి అక్కడ చేపల కోసం వలలు వేశారు..

ఇవాళ ఉదయం 8 గంటల సమీపంలో వీరి వలకు చేపలు పడ్డాయి.

పడవ పై నుంచి వలను పైకి లాగుతుంటే బరువుగా ఉండటంతో దానిని పైకి లాగలేకపోయారు.

దీంతో వల చిక్కుకుందేమోనని చూసేందుకు జోగన్న అనే మత్స్యకారుడు పడవ నుంచి కిందకు దిగే ప్రయత్నం చేశారు.

ఆ సమయంలో చేప బలంగా దాడి చేసింది. దాంతో జోగన్న అక్కడే మృతి చెందారు. జోగన్న మృతదేహాన్ని మిగతా మత్స్యకారులు బయటకు తీసుకుని వచ్చారు.