కుమార్తె శవాన్ని భుజంపై వేసుకొని 10 కి.మీ. ప్రయాణం..

కుమార్తె శవాన్ని భుజంపై వేసుకొని 10 కి.మీ. ప్రయాణం… దర్యాప్తుకు ఆదేశించిన ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం.

మానవత్వం మంట కలుస్తున్న వేళ… కనీసం కనికరం కూడా లేకుండా వైద్య అధికారులు చేసిన పని ఎంత కంటతడి పెట్టింది మీరే చూడండి….
మండే ఎండలో కన్నకూతురు శవాన్ని 10 కిలోమీటర్లు భుజాలపై ఎత్తుకు తీసుకు వెళ్తున్న ఘటన చత్తీస్గఢ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది…
ఛత్తీస్‌గఢ్‌, సుర్గుజ జిల్లాలోని అమ్‌దల గ్రామస్థుడు ఈశ్వర్ దాస్ అనుభవించిన వెతలను తెలుసుకుంటే హృదయం ద్రవిస్తుంది. ఆయన తన ఏడేళ్ళ కుమార్తె మృతదేహాన్ని కుమార్తె శవాన్ని భుజంపై వేసుకొని 10 కి.మీ. ప్రయాణం…
ఈశ్వర్ దాస్ కుమార్తె సురేఖ తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండటంతో ఆమెను శుక్రవారం ఉదయం లఖన్‌పూర్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళారు. ఆమె ఆక్సిజన్ లెవెల్స్ దాదాపు 60కి పడిపోయాయి. ఈ కేంద్రంలో పని చేస్తున్న రూరల్ మెడికల్ అసిస్టెంట్ (ఆర్ఎంఏ) డాక్టర్ వినోద్ భార్గవ్ మాట్లాడుతూ, అవసరమైన చికిత్స చేసినప్పటికీ ఆమె పరిస్థితి మెరుగుపడలేదని, మరింత క్షీణించిందని చెప్పారు. ఆమె తుదిశ్వాస విడిచిందని తెలిపారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్ళేందుకు వాహనం వస్తుందని చెప్పామని, ఉదయం 9.20 గంటలకు ఆ వాహనం వచ్చిందని, అప్పటికే ఈశ్వర్ దాస్ తన కుమార్తె మృతదేహాన్ని తీసుకుని వెళ్ళిపోయారని చెప్పారు…ఈశ్వర్ దాస్ తన కుమార్తె మృతదేహాన్ని తన భుజాలపై మోసుకుంటూ సుమారు 10 కిలోమీటర్లు ప్రయాణించి, తన స్వగ్రామానికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవడంతో ఛత్తీస్‌గఢ్ ఆరోగ్య శాఖ మంత్రి టీఎస్ సింగ్ దేవ్ దర్యాప్తుకు ఆదేశించారు. అంబికాపూర్ జిల్లా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్‌కు దర్యాప్తు బాధ్యతలను అప్పగించారు. ఈశ్వర్ దాస్ తన కుమార్తె మృతదేహాన్ని తీసుకెళ్ళడానికి బదులు వాహనం వచ్చే వరకు వేచి చూసే విధంగా లఖన్‌పూర్‌లోని సంబంధిత వైద్యాధికారి నచ్చజెప్పి ఉండవలసిందన్నారు…