ఆరుగురు పిల్లల్ని బావిలో తోసి చంపిన తల్లి…

రాయ్‌గఢ్ జిల్లాలో (Raigad distric) దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ తన ఆరుగురు మైనర్ పిల్లలను బావిలో పడేసింది….తల్లి తన ఆరుగురు పిల్లలను దారుణంగా చంపేసింది. ఇంట్లో రగిలిన గొడవతో తన సంతానాన్ని కడతేర్చింది. బావిలో పడేసి ఆరుగురి ప్రాణాలను తీసింది. చనిపోయిన ఆరుగురు చిన్నారుల్లో అయిదుగురు అమ్మాయిలే ఉన్నారు. మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌ జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. ముంబైకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహద్ తాలూకాలోని ఖారావలి గ్రామంలో ఈ ఘటన జరిగింది. భర్త, కుటుంబీకులు కొట్టడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. బావిలో పడి ప్రాణాలు కోల్పోయిన పిల్లలు వయసు 18 నెలల నుంచి 10 ఏళ్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు…