దత్తప్పగూడెంలో దారుణం..ఒంటరిగా ఉన్న యువతిపై గుర్తుతెలియని దుండగుల దాడి.గొంతుకోసి పరారైన ఆగంతకులు….

దత్తప్పగూడెంలో దారుణం..ఒంటరిగా ఉన్న యువతిపై గుర్తుతెలియని దుండగుల దాడి
–యువతి గొంతుకోసి పరారైన ఆగంతకులు
మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఒంటరిగా ఉన్న యువతి పై గుర్తు తెలియని ఆగంతకుడు దాడికి ఒడిగట్టాడు. గుర్తుతెలియని వ్యక్తి యువతి గొంతు కోసి పరారవడంతో ఆ యువతిని భువనగిరి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దత్తప్పగూడెం గ్రామానికి చెందిన యువతి ఎలుగు యమున వలిగొండ మండలం లోతుకుంట గ్రామంలోని మోడల్ స్కూల్ లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న యమునపై బైక్ పై మాస్క్ ధరించి వచ్చిన వచ్చిన ఇద్దరు వ్యక్తులు దాడిచేసి యువతిని గోడకు కొట్టి కత్తితో గొంతు కోశారు. గొంతు కోసిన ఆగంతకులు వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. గొంతు కోయడంతో కేకలు, అరుపులు విని ఇరుగు పొరుగు వారు వచ్చి యువతిని చికిత్స కోసం హుటాహుటిన భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న యువతి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు గ్రామస్తులు తెలిపారు యువతిపై దాడి ఘటన సమాచారం తెలుసుకున్న మోత్కూర్ ఎస్సై వి జానకి రామ్ రెడ్డి సిబ్బందితో దత్తప్పగూడెం గ్రామాన్ని సందర్శించారు. రామన్నపేట సిఐ మోతీరాం గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. యువతిపై దాడి ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.