రైల్వే పోలీసుల కస్టడీకి సికింద్రాబాద్ అగ్నిపథ్ కు వ్యతిరేకంగా అల్లర్ల కేసు నిందితులు..

అగ్నిపథ్ కు వ్యతిరేకంగా గతనెలలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద జరిగిన అల్లర్ల కేసులో నిందితులను రైల్వే పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న 45మంది నిందితులను రైల్వే పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. రేపు సాయంత్రం 5గంటల వరకు పోలీసుల విచారణ కొనసాగనుంది. తిరిగి వారిని వైద్యపరీక్షల అనంతరం రైల్వే మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచి చంచల్ గూడ జైలుకు తరలిస్తారు…