పెద్దముల గ్రామంలో ఉద్రిక్తత,, పోడు భూముల్లో ఫారెస్ట్ అధికారులకు రైతుల మధ్య వివాదం…!

నల్గొండ జిల్లా…

చందంపేట మండలం పెద్దముల గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది అటవీ భూముల్లో మొక్కలు నాటేందుకు వచ్చిన అధికారులను అడ్డుకున్న పోడు భూమి సాగు రైతులు.. అధికారులు నాటిన మొక్కలను పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నా రైతులు మొక్కలను తొలగించి వేయడంతో, రైతులకు ఫారెస్ట్ అధికారులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం నెలకొంది..కొందరు రైతులు తాము వ్యవసాయం చేసుకుంటున్న భూమికి పట్టాలు పంపిణీ చేయ్యకపోగా మళ్లీ వీటిపైనే మొక్కలు నాటుతారా అంటూ ఆగ్రహంతో అధికారులపై తీరగా పడ్డారు… అంతేకాకుండా కొందరు రైతులు, ఫారెస్ట్ అధికారులపై దాడికి దిగారు… దీంతో పోడు భూముల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది..