బాలుడు ప్రాణాలు బలి తీసుకున్న స్కూల్ బ్యాగ్..!!

స్కూల్ నుండి తిరిగి అమ్మ వాడికి అల్లారు ముద్దుగా చేరే సమయంలో మృత్యు స్కూల్ బ్యాగ్ రూపంలో బాలుడిని వెంటాడింది… డ్రైవర్ నిర్లక్ష్యము లేక స్కూల్ బ్యాగ్ ప్రానం తీసిందో తెలియదు కానీ కన్నుమూసి తెరిచేలోపే బాలుడు ప్రాణం కాస్త గాల్లో కలిసిపోయింది ఈ హృదయ విదారక ఘటన చూసిన ప్రతి ఒక్కరికి స్థానికులకు కంటతడి పెట్టించింది…

యాదాద్రి భువనగిరి జిల్లా..

చౌటుప్పల్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. చౌటుప్పల్ లోని మల్లికార్జున స్కూల్ లో రెండవ తరగతి చదువుతున్న తోటకూరి తనోజ్ అనే అబ్బాయ్ రోజులాగనే సాయంత్రం స్కూల్ నుండి బస్సులో ఇంటి ముందుకు వచ్చి దిగాడు. బ్యాగ్ బరువుగా ఉండడంతో తనోజ్ బస్సు దిగగానే వెనక్కి పడిపోయాడు దాన్ని గమనించని బస్ డ్రైవర్ ముందుకు వెళ్లడంతో బస్ చక్రం ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు..