హైదరాబాద్ ఉప్పల్ లో తండ్రి కొడుకులు దారుణ హత్య…!!

*దారుణ హత్య…

హైదరాబాద్ ఉప్పల్ లో తండ్రి కొడుకులు దారుణ హత్య.ఉప్పల్ గాంధీ బొమ్మ వద్ద.. ఘటన.
ఉదయం తెల్లవారుజామున జరిగినట్లుగా చెబుతున్న స్థానికులు.

హైదరాబాద్ ఉప్పల్ లోని హనుమాన్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. తండ్రి , కొడుకులను అతి దారుణంగా హత్య చేసిన ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఉప్పల్‌ హనుమాన్‌ సాయినగర్‌కు చెందిన నర్సింహశర్మ, శ్రీనివాస్‌ తండ్రీ కొడుకులు. శ్రీనివాస్‌ మలేషియాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. నెల రోజుల కిందటే మలేషియా నుంచి వచ్చాడు. కాగా శుక్రవారం ఉదయం గుర్తుతెలియండి కొంతమంది దుండగులు ఇంట్లోకి ప్రవేశించి తండ్రి నర్సింహశర్మ, కొడుకు శ్రీనివాస్‌లను కత్తులతో కడుపులో పొడిచి అతి కిరాతకంగా హతమార్చారు…

హతులు నరసింహ 78, శ్రీనివాస్ 35 ఏళ్ల బ్రాహ్మణులు…

గొడ్డలితో తండ్రిపై దాడి చేస్తుండగా అడ్డువచ్చిన కొడుకు.

ఇద్దరినీ అత్యంత దారుణంగా హత్య చేసిన దుండగులు.

ఘటన జరిగిన కాలనీకి స్థలికి..రెండు వైపుల విధులు..తనను సైతం కత్తితో బెదిరించినట్లుగా చెబుతున్న పనిమనిషి..

తెల్లవారుజామున ఐదున్నర గంటల సమీపంలో బ్లూ టీ షర్టు వేసుకున్న వ్యక్తి గాంధీ బొమ్మ నుంచి మెయిన్ రోడ్డు వైపు పారిపోయినట్లుగా చెబుతున్న పొరుగువారు.

హుటాహుటిన ఘనస్థలికి చేరుకున్న ఉప్పల్ పోలీసులు

వెంటనే టీములుగా విడిపోయి పలు కాలనీలు, ప్రదేశాల్లో చుట్టుప్రక్కల గాలించిన పోలీసులు.

హతులిద్దరు అత్యంత సౌమ్యులని, ఇరుగుపొరుగు వారితో మంచి స్నేహపూర్వక సంబంధాలు ఉండేవని చెబుతున్న, (కాలనీవాసులు) ఉప్పల్ ప్రజానీకం.

హత్యకు గల కారణాలను సేకరించే పనిలో నిమగ్నమైన క్లూస్ టీమ్, స్థానిక, పోలీసులు.