పరువు హత్య.. కుమార్తెను చంపి సెల్ఫీ వీడియోను పోస్ట్ చేసిన కన్న తండ్రి…

విశాఖపట్నం.. విశాఖ రెల్లివీధిలో దారుణం జరిగింది. కన్నతండ్రే కుమార్తెను అత్యంత దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత సెల్ఫీవీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం కలకలం రేపింది.కుమార్తెను చంపిన తర్వాత తండ్రి ప్రసాద్‌ విశాఖ వన్‌టౌన్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇది పరువుహత్యగా భావిస్తున్నారు.