తెనాలిలో దారుణం..బ్యూటీ పార్లర్ భార్యను హత్య చేసి మృతదేహంపై పూలదండలు వేసిన భర్త…

గుంటూరు జిల్లా..

తెనాలిలో దారుణం జరిగింది. గాంధీనగర్ గంటావారి వీధిలో భార్యను.. భర్త దారుణంగా హత్య చేశాడు. కాకర్ల స్వాతికి కోటేశ్వరరావుతో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. భార్య పేరు మీద ఉన్న స్థలాన్ని అమ్మాలని భర్త ఇబ్బందిపెడుతున్నాడు. తనకు అప్పులు ఉన్నాయని గొడవపడుతున్నాడు. డబ్బుల విషయంలో కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతోంది. భార్య స్వాతి బ్యూటీ పార్లర్ నడుపుతుండగా అక్కడికి వెళ్లిన కోటేశ్వరరావు కత్తితో మెడపై నరికాడు. స్వాతి అక్కడికిక్కడే మృతి చెందింది. అనంతరం కోటేశ్వరరావు భార్య మృతదేహంపై పూలదండలు వేసి రూరల్ పోలీస్ స్టేషన్‎లో లొంగిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.