క్రిమినల్ చట్టాల్లో భారీ మార్పులు… తప్పు చేయాలంటే వణుకు పుట్టేలా కఠినమైన చర్యలు..!

క్రిమినల్ చట్టాల్లో భారీ మార్పులు…

దేశంలో క్రిమినల్ జస్టిస్ వ్యవస్థను సమూలంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన మూడు బిల్లులను కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ఈ బిల్లులను తీసుకొచ్చారు. ఇవి శిక్షించడానికి కావని, న్యాయం చేయడమే వాటి ఉద్దేశమని లోక్ సభలో ఈ బిల్లులు ప్రవేశపెట్టిన సందర్భంగా అమిత్ షా అన్నారు…

దేశద్రోహం కేసులో శిక్షలో మార్పులు చేస్తున్నట్లు అమిత్ షా ప్రకటించారు. ప్రస్తుత చట్టం ప్రకారం రాజద్రోహానికి యావజ్జీవ కారాగార శిక్ష లేదా మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. దీన్ని మూడు నుంచి ఏడేళ్ల జైలు శిక్షగా మార్చాలని కొత్త బిల్లులో ప్రతిపాదించారు.

మూకదాడుల కేసుల్లో మరణశిక్ష విధించే నిబంధనను కేంద్రం ప్రవేశపెడుతుందని పార్లమెంటులో ఆయన వెల్లడించారు. మైనర్లపై అత్యాచారాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించే నిబంధనలు కూడా కొత్త బిల్లులో ఉంటాయని ఆయన ప్రకటించారు..

గ్యాంగ్‌రేప్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష…

సీఆర్పీసీ బదులుగా భారతీయ న్యాయ సంహిత…

ఐసీపీ బదులుగా భారతీయ నాగరిక్ సురక్ష సంహిత…

ఎవిడెన్స్ యాక్ట్ బదులుగా భారతీయ సాక్ష్య బిల్లు…

మూడు బిల్లులను సభలో ప్రవేశపెట్టిన అమిత్‌షా…

బిల్లులపై మరింత చర్చించేందుకు స్టాండింగ్ కమిటీకి సిఫారసు…

క్రిమినల్ ప్రొసిజర్‌లో 313 మార్పులు…

పోలీసుల సెర్చ్ ఆపరేషన్‌లో వీడియోగ్రఫీ తప్పనిసరి…

మూక దాడులకు మరణ శిక్ష…

ఎక్కడి నుంచైనా ఈ-ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం…

మైనర్ల అత్యాచారం కేసుల్లో ఇక మరణశిక్ష…