26 అడుగుల పొడవైన మొసలి కడుపులో నుంచి ఓ బాలుడిని బయటికి తీసిన తాజాగా వెలుగులోకి వచ్చింది…

కన్నవారి ప్రేమ ఎంతకైనా తెగిస్తుంది అంటే ఇదేనేమో… ముసలి కడుపులోనుండి కన్న కొడుకుని బయటికి తీసిన తండ్రి….

26 అడుగుల పొడవైన మొసలి కడుపులో నుంచి ఓ బాలుడిని బయటికి తీసిన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఇండోనేషియాలోని ఈస్ట్‌ కలిమన్‌తన్‌‌లో సుబ్లియాన్షా అనే వ్యక్తి నివాసముంటున్నాడు. అతడికి దిమస్‌ ముల్కన్‌ సపుత్ర అనే ఎనిమిదేళ్ల కొడుకు ఉన్నాడు. బుధవారం ఈ తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి దగ్గరలోని నది దగ్గరకి చేపలు పట్టేందుకు వెళ్లారు. ఇద్దరూ చేపలు పడుతున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది.అయితే హఠాత్తుగా ఎక్కడ నుంచి వచ్చిందో.. 26 అడుగుల పొడవైన ఓ మొసలి దిమస్‌పై దాడి చేసింది. అది గమనించిన తండ్రి సుబ్లియాన్షా.. కొడుకును కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ వృధా అయిపోయాయి. ఆ మొసలి బాలుడితో సహా నీటిలోకి వెళ్లిపోయింది. నమలకుండా ఆ బాలుడ్ని అమాంతం మింగేసింది. గురువారం గ్రామస్థులతో కలిసి సుబ్లియాన్షా ఆ మొసలిని చంపి ఒడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం దాని పొట్ట కోసి.. దిమస్ మృతదేహాన్ని బయటికి తీశారు. కన్నీటి వీడ్కోలుతో దిమస్‌కు అంత్యక్రియలు నిర్వహించారు.