రాజ్యసభ ఎన్నికల్లో భారీగా క్రాస్‌ ఓటింగ్‌. ఉత్తరప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, కర్ణాటకలో క్రాస్‌ ఓటింగ్‌..!!

రాజ్యసభ ఎన్నికల్లో భారీగా క్రాస్‌ ఓటింగ్‌. ఉత్తరప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, కర్ణాటకలో క్రాస్‌ ఓటింగ్‌.

ఉత్తర్‌ప్రదేశ్‌లో 10 రాజ్యసభ సీట్లకు పోలింగ్‌.

ఏడుగురిని గెలిపించుకునే బలమే ఉన్నా 8మందిని బరిలోకి దించిన బీజేపీ.

బలమున్నా మూడో అభ్యర్థిని గెలిపించుకోలేపోతున్న ఎస్పీ.

ఓటింగ్‌ తర్వాత ముఖ్యమంత్రి యోగిని కలిసిన 8 మంది ఎస్పీ ఎమ్మెల్యేలు.

కర్ణాటకలో నాలుగు రాజ్యసభ సీట్లకు బరిలో ఐదుగురు అభ్యర్థులు…

దేశంలోని 15 రాజ్యసభ స్థానాలకు మంగళవారం (ఫిబ్రవరి 27న) ఎన్నికలు జరుగుతున్నాయి. కర్ణాటక, ఉత్తర్ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్‌లోని 15 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో మూడు రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే కర్ణాటక, ఉత్తర్ప్రదేశ్లో క్రాస్‌ ఓటింగ్‌ జరగవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ముందుజాగ్రత్తగా కర్ణాటకలోని కాంగ్రెస్ తమ పార్టీ ఎమ్మెల్యేలను హోటల్కు తరలించింది. ఉత్తర్ప్రదేశ్లో సమాజ్ వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఏర్పాటు చేసిన డిన్నర్కు 8మంది ఎమ్మెల్యేలు గైర్హాజరైనట్లు సమాచారం.

నాలుగు స్థానాలు- ఐదుగురు పోటీ
కర్ణాటకలో నాలుగు రాజ్యసభ స్థానాలకు మొత్తం ఐదుగురు పోటీలో ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్‌కు చెందిన అజయ్‌ మాకెన్‌, సయ్యద్‌ నజీర్‌ హుస్సేన్‌, జీసీ చంద్రశేఖర్‌లు పోటీలో ఉండగా బీజేపీ నుంచి నారాయణ్‌ భాండగే, జేడీఎస్‌కు చెందిన కుపేంద్ర రెడ్డి బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో క్రాస్‌ ఓటింగ్‌ జరగవచ్చనే వార్తలు రావడం వల్ల అన్ని పార్టీలు తమ ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేశాయి. ముందు జాగ్రత్తగా కాంగ్రెస్‌ తన ఎమ్మెల్యేలను బెంగళూరులోని ఓ హోటల్‌కు తరలించింది. సోమవారం రాత్రి అక్కడే శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించింది…

బీజేపీ ఒత్తిడి తెస్తోంది’
రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలపై భారతీయ జనతా పార్టీ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడేలా ఒత్తిడి తెస్తోందని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. “సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు గెలుస్తారని మేం ఆశిస్తున్నాం. కానీ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ అన్ని వ్యూహాలను ప్రయోగిస్తోంది. విజయం కోసం ఆ పార్టీ ఏమైనా చేస్తోంది. వ్యక్తిగత ప్రయోజనాలను కోరుకునే కొందరు ఎస్పీ నాయకులు బీజేపీలోకి వెళ్లవచ్చు” అని తెలిపారు. నటి జయా బచ్చన్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి అలోక్‌ రంజన్‌, రామ్‌జీ లాల్‌ సుమన్‌ను ఎస్పీ రంగంలోకి దించింది..