సీఎస్ఆర్ నిధులతో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు… మాజీ మంత్రి హరీష్ రావు..

రూ.50లక్షల సీఎస్ఆర్ నిధులతో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసుకున్నాం. రాబోయే కాలం మొత్తం కంప్యూటర్ యుగమే కావున విద్యార్థులు వీటిని వినియోగించుకోవాలని మాజీ మంత్రి హరీశ్‌ రావు(Harish Rao) అన్నారు. జిల్లా
( Siddipet) కేంద్రంలోని గర్ల్స్ హై స్కూల్‌లో బుధవారం కంప్యూటర్ ల్యాబ్‌ని(Computer lab) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పాఠశాల దినదిన అభివృద్ధి జరుగుతుందన్నారు.గతంలో వర్షం వస్తే పెచ్చులు ఉడుతాయని భయంతో ఈ బడిని బంద్ చేసేవారు. కానీ, నేడు కార్పొరేట్ స్కూల్‌ని తలదన్నేలా ఉందన్నారున. త్వరలోనే ఈ పాఠశాలకు ఇన్‌స్ట్రకర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం జీవన విధానంలో భాగమైందని చెప్పారు..జిల్లాలో ఎక్కువ మంది ఆడపిల్లలు చదివే పాఠశాల ఇది . ఈసారి పదో తరగతిలో వందశాతం పలితాలు సాధించాలన్నారు. మీరు నాకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ పదికి పది మార్కులు సాధించడమేనని చెప్పారు. అలాగే నీటిని వృథా చేయవద్దు, అవసరం మేరకే వాడుకోవాలని సూచించారు..