ప్రకాశ్‌ రాజ్‌పై నటుడు సీవీఎల్‌ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు..

(మా) ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడడంతో ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌, మంచు విష్ణు ప్యానల్‌ సభ్యులు ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. మీడియా సమావేశాలు పెట్టి మరి ప్రత్యర్థులపై మాటల తూటాలు వదులుతున్నారు…ప్రకాశ్‌ రాజ్‌పై నటుడు సీవీఎల్‌ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మా అధ్యక్ష పదవి పోటీ నుంచి ఆయన తప్పుకున్న విషయం తెలిసిందే. నామినేషన్ విత్ డ్రా చేసుకున్నాక సీవీఎల్ తన మద్దతును మంచు ప్యానెల్ కు తెలిపాడు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విష్ణు ప్యానెల్ లో వున్న బాబు మోహన్, ప్రకాశ్‌ రాజ్ ప్యానెల్ లో వున్న ఉత్తేజ్ నీ గెలిపించండి. దేశం అన్నా.. దేవుడు అన్నా.. చులకన భావం వున్న ప్రకాశ్‌ రాజ్ ను ఒడించండి. నేను.. నేను.. నేను.. తప్పు మరొక విషయం పట్టని ప్రకాశ్‌ రాజ్ ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా వుంటే బాగుంటుంది. బహుశా అతను విత్ డ్రా చేసుకుంటాడు అని ఆశిస్తున్నాను’ అంటూ సీవీఎల్ అన్నారు.