రోజు రోజుకు పెరుగుతున్న సైబర్‌ నేరాలు, దేశవ్యాప్తంగా ప్రతీనెల 80 వేల కేసులు..

⚪️ న్యూఢిల్లీ…

టెక్నాలజీకి అనుగుణంగా నేరాల స్వభావం కూడా మారుతోంది. ప్రపంచంలో ఎక్కడో కూర్చొని బాధితుల ఖాతాల్లోని డబ్బును కొట్టేస్తున్నారు కేటుగాళ్లు. ఇక టెక్నాలజీపై అవగాహన ఉన్న దేశాల్లోనే ఎక్కువగా ఈ సైబర్‌ నేరాలు జరుగుతుండడం గమనార్హం. ఈ క్రమంలోనే తాజాగా అమెరికాకు చెందిన ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (FBI) ప్రపంచంలో ఏ దేశాల్లో అధికంగా సైబర్‌ నేరాలు జరుగుతున్నాయన్న దానిపై ఓ నివేదికను విడుదల చేసింది. ఈ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచంలోనే సైబర్‌ నేరాలు ఎక్కువగా జరుగుతోన్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉండగా భారత్‌ 4వ స్థానంలో ఉంది. .

రోజు రోజుకు పెరుగుతున్న సైబర్‌ నేరాలు, దేశవ్యాప్తంగా ప్రతీనెల 80 వేల కేసులు నమోదు, సైబర్‌ నేరగాళ్ల బారిన పడుతోన్న 42 శాతం మంది ప్రజలు, నెలకు దాదాపు రూ.200 కోట్లు కొల్లగొడుతున్న సైబర్‌ నేరగాళ్లు, డెబిట్‌, క్రెడిట్‌ కార్డుతో పాటు ఆన్‌లైన్‌లో మోసాలు