దావూద్ ఇబ్రహీం భారీ కుట్రను బట్టబయలు చేసిన ఎన్ఐఏ..

దావూద్ ఇబ్రహీం భారీ కుట్రను బయటపెట్టిన ఎన్ఐఏ..

విదేశాలకు పారిపోయిన గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం భారత దేశంపై దాడి చేసేందుకు ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వెల్లడించింది. ఈ గ్యాంగ్‌స్టర్ హిట్ లిస్ట్‌లో భారత దేశ రాజకీయ నేతలు, ప్రముఖ వ్యాపారవేత్తలు ఉన్నట్లు తెలిపింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో హింసను రెచ్చగొట్టేందుకు ప్రాణాంతక ఆయుధాలు, పేలుడు పదార్థాలతో దాడులు నిర్వహించాలని కుట్ర పన్నినట్లు వివరించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో దాడులు చేయడంతోపాటు ముఖ్యంగా ఢిల్లీ, ముంబైలపై దావూద్ ఇబ్రహీం దృష్టి పెట్టినట్లు తెలిపింది. ఈ మేరకు ఓ ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్)ను నమోదు చేసింది.