నేటి నుండి ధవలేశ్వరం బ్యారేజీ మూసివేత..!

తూ” గోదావరి జిల్లా: ఫిబ్రవరి జీరో 01
ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ను ఇవాళ్లి నుంచి మూసివేయనున్నారు. బ్యారేజ్ రోడ్డు మరమ్మత్తుల నిమిత్తం వాహనాలు తిరగకుండా 10 రోజులు పాటు మూసివేసి ఉంచుతారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ రోడ్డుపై 2 కోట్ల రూపాయలు ప్రతిపాదనలతో మరమ్మత్తు పనులు చేపట్టారు.

మరమ్మత్తు పనులు నిమిత్తం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ రహదారి మూసివేస్తున్నట్టు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. బ్యారేజ్ పై నుంచి ప్రయాణించే ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సుల యాజమాన్యాలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.

ఇక, ఇవాళ్టి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు మరమ్మత్తులు కొనసాగనుండగా.. అనంతరం యథావిథిగా రాకపోకలకు అనుమతి ఇవ్వనున్నారు. మరోవైపు.. ఈ పనులు నాణ్యత కలిగి త్వరితగతిన పూర్తి చేసేలా ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా రాజమండ్రి రూరల్ మండలంలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ మరమ్మత్తు పనుల నిమిత్తం 10 రోజుల పాటు మూతపడనుండగా.. ఇరిగేషన్ అధికారుల కోరిక మేరకు పోలీస్ అధికారుల ట్రాఫిక్ మళ్లింపుపై చర్యలు చేపట్టారు.. కాటన్‌ బ్యారేజ్‌ మీదుగా ప్రయాణాలు సాగించేవారు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు జిల్లా కలెక్టర్ కె. మాధవీలత.