తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి కన్నుమూశారు…

డాలర్ శేషాద్రి కన్నుమూత..

R9TELUGUNEWS.COM.: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి కన్నుమూశారు. విశాఖలో కార్తిక దీపోత్సవం కార్యక్రమానికి హాజరైన ఆయనకు ఈ వేకువజామున గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తరలించేలోపే ఆయన తుదిశ్వాస విడిచారు. 1978 నుంచి శ్రీవారి సేవలో డాలర్‌ శేషాద్రి తరిస్తున్నారు. గతంలోనే రిటైర్మెంట్‌ అయినప్పటికీ ఓఎస్డీగా ప్రభుత్వం నియమించడంతో తిరుమల ఆలయానికి సేవలు అందిస్తున్నారు. డాలర్‌ శేషాద్రి మరణం తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే)కి తీరని నష్టమని తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు భర్తీకాదని చెప్పారు.