దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళితబంధు పథకం.. మంత్రి హరీష్‌..

R9TELUGUNEWS.COM. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళితబంధు పథకం దోహదపడుతుందని పాలనాధికారి హరీష్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో దళితబంధుపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెదక్‌, నర్సాపూర్‌ నియోజకవర్గాలతో పాటు, అందోల్‌ నియోజకవర్గ పరిధి టేక్మాల్‌ మండలం హసన్‌మహమ్మద్‌పల్లి గ్రామం కలిపి మొత్తం 256 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 201 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు తెరిచారని, 169 మంది వివరాలు పోర్టల్‌లో నమోదు చేసినట్లు పేర్కొన్నారు. పాడి, పౌల్ట్రీ, ,కిరాణ, పరిశ్రమలు, రవాణా, కూరగాయల సాగుపై అవగహన కల్పించాలన్నారు. ఈనెల 14 నుంచి 17 వరకు అవగాహన శిబిరాలు నిర్వహించాలని సూచించారు. నియోజకవర్గానికి ఒక ప్రత్యేకాధికారి, గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి పథకాన్ని అమలు చేయాలన్నారు. ఎలాంటి వాయిదాలు చెల్లించకుండా, పూర్తి రాయితీతో లబ్ధిదారులకు రూ.10 లక్షలు అందించడం జరుగుతుందని తెలిపారు.