దానం నాగేందర్‌పై కాంగ్రెస్ అధిష్టానం గుస్సా..మళ్లీ తెరపైకి బొంతు రామ్మోహన్ పేరు… కారణం ఇదే..!?!

దానం నాగేందర్‌పై కాంగ్రెస్ అధిష్టానం గుస్సా..

ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పిన ఏఐసీసీ.. ముందు సరే అని ఇప్పుడు ఎమ్మెల్యేగా రాజీనామా చేయడానికి ఒప్పుకొని దానం నాగేందర్.

సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిని మార్చే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం.

మళ్లీ తెరపైకి బొంతు రామ్మోహన్ పేరు..

లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల ఎంపికలో ఆటుపోట్లు తగుతున్నాయి. ఇప్పటికే పలు ఎంపీ స్థానాలకు గాను టికెట్ ఆశించి భంగపడిన నాయకులు తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తపరుస్తున్నారు. అదేవిధంగా ఇటీవలే పార్టీలోకి వలస వచ్చిన నేతలు సైతం ఏఐసీసీకి ఝలక్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ అధిష్టానానికి షాక్ ఇచ్చినట్లుగా సమాచారం. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ హామీతో పార్టీలో చేరిన ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. అయితే, రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ ఇస్తామని దానంకు పార్టీలో చేరే ముందు ఏఐసీసీ చెప్పినా.. ఇప్పుడు అప్పుడు అంగీకరించపోవడం ఏఐసీసీకి కోపం తెప్పించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిని మార్చే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అయితే, ఇప్పటికే సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న బొంతు రామ్మోహన్ పేరును మరోసారి ఏఐసీసీ పరిశీలిస్తోందనే టాక్ వినిపిస్తోంది. ..