కేసీఆర్ చనిపోవాలని కోరుకోవడం కరెక్ట్ కాదు: దానం నాగేందర్.

కేసీఆర్ చనిపోవాలని కోరుకోవడం కరెక్ట్ కాదు: దానం నాగేందర్.

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చనిపోవాలని కోరుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయ పోరాటం మాత్రమే చేయాలని సూచించారు.
కేసీఆర్‌పై తమ పార్టీకి రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ.. వ్యక్తిగతంగా ఆయనకు హాని కలగాలని కోరుకోవడం సరికాదని దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తోటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఆయన చురకలు అంటించారు.
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమేనని.. అయితే వ్యక్తిగత దూషణలకు, శాపనార్థాలకు తావివ్వకూడదని దానం నాగేందర్ పేర్కొన్నారు. ప్రత్యర్థులపై రాజకీయంగానే పోరాడాలని ఆయన వ్యాఖ్యానించారు.