భవిష్యత్తులో నీటి కొరత కారణంగా ఆకలి చావులు పెరగనున్నాయని నిపుణుల హెచ్చరికలు.. బ్రహ్మంగారు చెప్పినట్టే జరగబోతుందంటూ ప్రచారం..

ఇటీవల అతివృష్టి అనావృష్టిలు చూస్తుంటే దాదాపు ప్రజలు భయానక వాతావరణమే ఎదురవుతుంది… ఊర్లకు ఊర్లు కొట్టుకోపోవడం పెద్దపెద్ద బిల్డింగులు నేలమట్టం కావడం ఒక్కసారిగా ఊహించని ఈదురు గాలులు వర్షాలు ఓ పక్క ప్రజల్ని భయానిక వాతావరణంలోకి నెట్టేసి ఉంటే మరో పక్కన పెరుగుతున్న ధరలు.. ఆహార నిల్వల్ల కొరతలు కూడా అందర్నీ ఆందోళన కలిగిస్తుంది.. అగ్రదేశాల సైతం కూడా చిరుధాన్యాలకి నీటికి కొంత ఇబ్బందులు పడుతూనే ఉంది..

భవిష్యత్తులో నీటి కొరత కారణంగా ఆకలి చావులు పెరగనున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రహ్మంగారి వాక్కు నిజం కానుందని తెలుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. నీటి కొరత తలెత్తనున్న దేశాల్లో.. భారతదేశం లాంటి అగ్ర దేశం సైతం ఉండడం గమనార్హం.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 25 దేశాలు తీవ్ర నీటి కొరత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. మొన్నటికి మొన్న భారతదేశవ్యాప్తంగా విపరీతమైన వర్షాలు ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఎక్కడ చూసినా వరద నీరే కనిపించింది.. అటువంటిది కొన్నిచోట్ల ఇప్పుడు గుక్కెడు నీటి కోసం ప్రజలు కటకటలాడుతున్నారు. వరల్డ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ తాజాగా జరిపిన సర్వేలో నివ్వెర పోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నివేదికలో పొందుపరిచిన సమాచారం ప్రకారం ప్రపంచ జనాభాలో 25 శాతం మంది నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొంటున్నారు.అత్యధికంగా పశ్చిమ ఆసియా, ఉత్తర ఆఫ్రికా దేశాలు తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇక్కడ నివసించే ప్రజల్లో దాదాపు 83 శాతం మంది నీటి ఎద్దడితో బాధపడుతున్నారు. అరబిక్ దేశాలైన బెహ్రయిన్, సైప్రాస్, కువైట్, ఒమన్, లేబనాన్ ఏట నీళ్ల కరువుతో ఇబ్బంది పడుతున్నాయి. ప్రపంచ జనాభాలో 50% అంటే.. 400 కోట్ల జనాభాకు ఏడాదిలో ఒక నెల రోజులు నీరు లభించక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా నీటి సమస్య కలిగిన దేశాల జాబితాలో భారత్, సౌదీ అరేబియా, చిలి, శాన్ మేరీనో, బెల్జియం, గ్రీస్ వంటి అగ్ర దేశాలు ఉన్నాయి. అన్నింటికీ మించి 2050 నాటికి 80 శాతం మందికి సురక్షిత మంచినీరు అందే పరిస్థితి ఉండదని ఈ నివేదికలో తేలడం ఆందోళన కలిగిస్తోంది… ఎండ తీవ్రతలు కూడా కాలంతో సంబంధం లేకుండా ఉండడం కూడా కొంత ఆందోళన కలిగిస్తుంది…