దంతేవాడలో లొంగిపోయిన 26 మంది మావోయిస్టులు..

లోక్‌సభ ఎన్నికల ముందు ఛత్తీస్‌గఢ్‌లో కీలక పరిణా మం చోటు చేసుకుంది. దంతెవాడలో మొత్తం 26 మంది నక్సలైట్లు సోమ వారం సాయంత్రం పోలీసు ల ఎదుట లొంగిపోయారు.

ఈ ప్రాంతంలో ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. లొంగి పోయిన వారిలో ‘జోగా ముచకి’ అనే మావోయిస్టుపై రూ.లక్ష బహుమతి ఉందని దంతెవాడ పోలీసు సూపరింటెండెంట్ గౌరవ్ రాయ్ తెలిపారు.

26 మంది వ్యక్తుల్లో ఐదుగురు మహిళలతో పాటు ఇద్దరు బాలికలు ఉన్నారని పోలీసులు వెల్లడించారు…