ధర్మపురి MLA అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ కారు బోల్తా…

*ప్రభుత్వ విప్ ప్రయాణిస్తున్న కారుకు పెను ప్రమాదం..*
ఇటీవల రోడ్డు ప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం, మితిమీరిన వేగంతో ప్రయాణించడం వల్ల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వాహనదారులు అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వాహనాలను నడిపి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. తాజాగా ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు పెను ప్రమాదం తప్పింది…

తెలంగాణప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ ప్రయాణిస్తున్న కారుకు పెను ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా ఎండ పల్లి మండలం అంబారిపేట వద్ద కారు బోల్తా పడింది..

ఘటన సమయంలో విప్ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ కారులోనే ఉన్నారు. ఆయనతో పాటు కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయే క్రమంలో ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని చికిత్స కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలయ్యాయి. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాస్పిటల్ వైద్యుల తో మాట్లాడారు. మెరుగైన వైద్యం కోసం లక్ష్మణ్ ను హైదరాబాద్‌కు తరలించారు..