ఉక్రెయిన్ శ్మ‌శానవాటిక‌లో 45 ఫీట్ల కంద‌కం….

ఉక్రెయిన్ రాజధాని కీవ్ స‌మీపంలో ఉన్న బుచ్చా ప‌ట్టణం ఇప్పుడో శ‌వాల దిబ్బ‌గా మారింది. అక్క‌డ భారీ స్థాయిలో ర‌ష్యా సైనికులు సామూహిక హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డారు. ఓ శ్మ‌శానవాటిక వ‌ద్ద సుమారు 45 అడుగ‌ల గొయ్యి ఉన్న‌ట్లు అమెరికాకు చెందిన మాక్స‌ర్ టెక్నాల‌జీస్ శాటిలైట్ సంస్థ ఫోటోలు రిలీజ్ చేసింది. మార్చి 31వ తేదీన ఆ ఇమేజ్‌ల‌ను తీసిన‌ట్లు ఆ సంస్థ చెప్పింది. సెయింట్ ఆండ్రూ చ‌ర్చి, పెర్వోజ్‌వ‌న్నో ఆల్ సెయింట్స్ చ‌ర్చి వ‌ద్ద ఉన్న మైదానాల్లో సామూహిక ఖ‌న‌నాలు ఉన్న‌ట్లు గుర్తించారు. భారీ కంద‌కాల‌ను తొవ్వుతున్న దృశ్యాల‌ను మార్చి 10వ తేదీన తీసిన చిత్రాల్లో చూడ‌వ‌చ్చు అని ఆ కంపెనీ తెలిపింది. శ్మ‌శాన‌వాటిక వ‌ద్ద లెక్క‌లేని సంఖ్య‌లో శ‌వాలు ఉన్న‌ట్లు కొంద‌రు జ‌ర్న‌లిస్టులు కూడా పేర్కొన్నారు.