డెబిట్ కార్డు లేకుండానే ఏటీఎం వద్దకెళ్లి మనీ విత్ డ్రా..!!!

దాదాపు పదేండ్ల క్రితం వరకు నగదు విత్ డ్రా చేసుకోవాలంటే డెబిట్ కార్డుతో ఏటీఎం దగ్గరికెళ్లాలి.. ఇప్పుడు మొబైల్ యాప్ ఆధారిత పేమెంట్స (యూపీఐ) ఎక్కువయ్యాయి. అందరూ దాదాపుగా ఆన్ లైన్ చెల్లింపులే చేస్తున్నారు. ఎంత డిజిటల్ సేవలకు మళ్లినా.. ఒక్కోసారి క్యాష్ అవసరం రావచ్చు. అటువంటప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలా డెబిట్ కార్డు లేకుండానే ఏటీఎం వద్దకెళ్లి మనీ విత్ డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం మొబైల్ ఫోన్ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ – UPI) సాయంతో క్యాష్ తీసుకునే వెసులుబాటు ఆర్బీఐ తీసుకొచ్చింది. అన్ని బ్యాంకుల ఏటీఎంల వద్ద డెబిట్ కార్డు రహిత లావాదేవీలు పూర్తి చేయొచ్చు. డెబిట్ కార్డు లేకున్నా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్‌ల సాయంతో మనీ విత్ డ్రా చేసుకోవచ్చు.