డిసెంబర్ 31న భారత్ బంద్ క్లారిటీ ఇచ్చిన కేంద్రం.

R9TELUGUNEWS.COM దేశవ్యాప్తంగా డిసెంబర్ 31 వరకు భారత్ బంద్ అంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని కేంద్రప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్చిక్ టీం ఖండించింది. కేంద్రప్రభుత్వం అలాంటి ప్రకటనేం చేయలేదని, సోషల్ మీడియాలో వస్తున్న ఆ ప్రచారాన్ని నమ్మవద్దని తెలిపింది. అలాంటి ఫొటోలు, మెసేజ్లు షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేసింది.