డెహ్రాడూన్‌లో వర్షాల బీభత్సం…!

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ జిల్లా రాయ్‌పూర్ బ్లాక్‌లో శనివారం తెల్లవారుజామున క్లౌడ్‌బరస్ట్ సంభవించింది. డెహ్రాడూన్‌లో వర్షాల బీభత్సం సృష్టిస్తున్నాయి. సమాచారం అందుకున్న స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డిఆర్‌ఎఫ్) బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. ముంపు గ్రామంలో చిక్కుకున్న ప్రజలందరినీ రక్షించారు. కొందరు సమీపంలోని రిసార్ట్‌లో ఆశ్రయం పొందుతున్నట్టు SDRF తెలిపింది…దీంతో మాతా వైష్ణో దేవీ గుహ యోగ దేవాలయం, తపకేశ్వర్ మహాదేవ్ ఆలయాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. వరద నీరంతా ఆలయంలోకి చేరింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆ ఆలయం వ్యవస్థాపకులు ఆచార్య బిపిన్ జోషి తెలిపారు. దీంతో యాత్రికుల తరలింపు ప్రక్రియ కూడా నిలిపివేశారు. పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఇప్పటికే మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు..